Mahesh Babu : పుట్టెడు దుఃఖంలో ఉన్న మహేశ్ బాబు నవ్వుకు అదే కారణమట..!

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మరణం ఆయన కుటుంబ సభ్యులకే కాకుండా యావత్ ఇండస్ట్రీకి, తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో కుటుంబంలో ముగ్గురు ఆత్మీయులను కోల్పోయిన మహేశ్ బాబు Mahesh Babu దుఃఖం ఎవరికీ రాకూడదంటూ ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కేవలం నెల వ్యవధిలోనే మహేశ్ బాబు తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఆయన బాధ వర్ణణాతీతం.

మహేశ్ బాబు / Mahesh Babu
మహేశ్ బాబు / Mahesh Babu

ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే మహేశ్ ను బ్యాక్ టూ బ్యాక్ విషాదాలు చుట్టుముట్టాయి. తన తల్లి ఇందిరాదేవి అంతిమయాత్రలో కన్నీటి పర్యంతమవ్వడం చూసిన అభిమానులు గుండె తరుక్కుపోయింది. ముఖ్యంగా తన కూతురు సితారను ఓదారుస్తూ తాను కంటతడి పెట్టిన దృశ్యాలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. స్టే స్ట్రాంగ్ సూపర్ స్టార్ అంటూ అభిమానులు ఆయనకు అండగా నిలిచారు.

- Advertisement -

ఆ విషాదం నుంచి తేరుకోకముందే మహేశ్ బాబు తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణను కోల్పోయారు. మరోసారి కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు అంతా దుఃఖంలో ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మహేశ్ బాబు కంటతడి పెట్టడం చూసి ఫ్యాన్స్ కడుపు తరుక్కుపోయింది. మా మహేశ్ అన్నకు ఈ కష్టాలు ఏంటంటూ బాధ పడ్డారు.

కృష్ణ పార్థివ దేహానికి చివరిసారిగా నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రముఖులంతా మహేశ్ బాబుకు సానుభూతి తెలిపారు. మహేశ్ బాబు దుఃఖం చూడలేక కొందరు నటులు కూడా కంటతడి పెట్టారు. అప్పటి వరకు విషాదంలో ఉన్న మహేశ్ బాబు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వారు. అంతటి విషాదంలో సూపర్ స్టార్ ముఖంపై నవ్వు తీసుకువచ్చింది ఎవరో తెలుసా ఇంకెవరు మన బాలయ్య బాబే.  కృష్ణ కు నివాళులు అర్పించిన బాలకృష్ణ ఆ తర్వాత కొద్ది సమయం మహేశ్ బాబుతో  ముచ్చట పెట్టారు. ఆ సమయంలోనే అక్కడ గౌతమ్, గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.

మహేశ్ తో బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న గౌతమ్ ని చూసి మీ వాడు పెద్దోడయ్యాడోయ్ హీరోగా పరిచయం చేయొచ్చు అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు గౌతమ్ తో పాటు మహేశ్ కూడా మురిసిపోతూ నవ్వాడని అభిమానులు భావిస్తున్నారు.

దుఃఖంలో ఉన్న మహేశ్ కు తన కొడుకు గురించి మాట్లాడిన సమయంలో నవ్వు వచ్చిందని.. ఆ సమయం లోనే అలా నవ్వుతూ కనిపించారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా అయితే అలాంటి చోట జోకులు వేయడం.. నవ్వించడం వంటివి చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కానీ బాలయ్య పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు.

దుఃఖంలో ఉన్న మా బాబును నవ్వించిన బాలయ్య కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఎప్పటిలాగే కొందరు మాత్రం బాలయ్య కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదా అని విమర్శించారు. మొత్తానికి ఆ నవ్వులు అయితే ఆ రోజు తర్వాత రోజు కూడా వైరల్ అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here