Taraka Ratna కు ఎన్టీఆర్ అంత డబ్బులు ఎందుకు ఇచ్చేవాడో తెలుసా?

- Advertisement -

నందమూరి Taraka Ratna … ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హీరో పేరే వినిపిస్తోంది..అతి చిన్న వయసులోనే భార్య పిల్లలను, తల్లిదండ్రులను ఒంటరి చేసి ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం.. ఆయన మరణ వార్త వినగానే నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.హార్ట్ ఎటాక్ కి గురై 23 రోజులపాటు విదేశీ వైద్యుల సహాయంతో చికిత్స పొందుతూ మరణించారు తారక రత్న. ఆయన చనిపోయినప్పటి నుండి ఆయన గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

ఆయన జీవితంలో దాగిఉన్న ఎన్నో రహస్యాలు బయటకు వస్తున్నాయి.. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు తారకరత్నకు మధ్య ఉన్న ఓ సీక్రెట్ కూడా బయటపడింది.. అలేఖ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నన్ను ఎవ్వరూ దగ్గరకు రానివ్వలేదు.. అస్సలు కుటుంబం నుంచే వెలివేశారు..ఇక అలా కుటుంబానికి దూరమయ్యాక తారకరత్న చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం తన పిల్లలకు ఏం కావాలో వారి చిన్నచిన్న అవసరాలు కూడా తీర్చలేకపోయాడట. ఇక ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా తన అన్న తారకరత్న కి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా నెలకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవాడట..

Taraka Ratna Jr NTR
Taraka Ratna Jr NTR

ఇంత జరిగినా కూడా ఎన్టీఆర్ తనకు ఏదొక విధంగా డబ్బులు ఇచ్చేవాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తారకరత్న ఆ విషయాలను పంచుకున్నారు.. అంతేకాదు తన ఫ్యామిలీ అలా ఉండడానికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఇప్పుడు నా కుటుంబం నేను ఎలా ఉండేవాళ్ళమో అని కూడా ఆ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనాప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న మధ్య అనుబంధం ఎలాంటిదో ఈ విషయంతో అందరికీ అర్థమైపోతుంది. ఇక తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 3:30 గంటలకు మహాప్రస్థానంలో ముగుస్తాయని ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చారు..మరోవైపు తారకరత్న భార్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..ఆమె ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here