Taraka Ratna : నందమూరి కుటుంబం తారకరత్న ని ఇంతలా అవమానించిందా.. ఆయన చివరి మాటలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

- Advertisement -

నందమూరి Taraka Ratna ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడని నందమూరి కుటుంబం మొత్తం అతనిని దూరం పెట్టేసిందంటూ సోషల్ మీడియా లో ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించిన తారకరత్న వాళ్ళు అలా దూరం పెట్టడం తో ఎంతో మానసిక వేదనకి గురయ్యాడు అంటూ ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ప్రముఖ రాజకీయ నాయకుడు విజయ్ సాయి రెడ్డి రెండవ చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డి ని పెళ్లాడాడు తారకరత్న.

Taraka Ratna
Taraka Ratna

ఆమెకి తారకరత్న కి ముందే సందీప్ రెడ్డి అనే అతనితో వివాహం అయ్యింది, కొన్నేళ్లు కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య తరుచు విబేధాలు వస్తుండడంతో విడిపోవాల్సి వచ్చింది.ఆ తర్వాత కొన్నాళ్ళకు తారకరత్న తో ప్రేమాయణం నడిపిన అలేఖ్య రెడ్డి, రహస్యంగా హైదరాబాద్ లోని సంఘీ టెంపుల్ లో తారకరత్న ని వివాహం చేసుకుంది.ఈమెతో పెళ్ళైన తర్వాత తారకరత్న ని నందమూరి కుటుంబం ఎంతలా దూరం పెట్టిందంటే కనీసం ఎదురు పడితే పలకరించడానికి కూడా ఇష్టపడని రేంజ్ లో అన్నమాట.

ntr taraka ratna

అయితే ఇదే విషయాన్నీ తారకరత్న ని గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి అడగగా ఆయన సమాధానం చెప్తూ ‘నన్ను ఎవ్వరూ దూరం పెట్టలేదునందమూరి కుటుంబం లో ఉన్న ప్రతీ ఒక్కరు ఎంతో ఆప్యాయంగా ప్రేమతో చూసుకునేవారు, ముఖ్యంగా మా బాలా బాబాయి, హరి కృష్ణ బాబాయి అయితే నన్ను సొంత కొడుకులాగానే చూసుకునేవాళ్ళు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ వార్తలు ఎక్కువ అయిపోయాయి, గతం నాకు నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా గొడవలు ఉన్నట్టు ఫేక్ ప్రచారాలు సృష్టించారు. మా నందమూరి కుటుంబం లో అలాంటివి ఏమి ఉండవు, అందరూ ప్రేమకి ప్రతిరూపం లాగ ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇటీవలే గుండెపోటు వచ్చి ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న తారకరత్న నిన్న సాయంత్రం తన ప్రాణాలను కోల్పోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఈ సందర్భంగా తారకరత్న గురించి సోషల్ మీడియా లో నిన్నటి నుండి ప్రచారం అవుతున్న ఈ వార్త పై, నందమూరి అభిమానులు గతంలో తారక రత్న చెప్పిన ఈ మాటలకూ సంబంధించిన వీడియోని అప్లోడ్ చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here