Taraka Ratna : మృత్యువుతో పోరాడి విజయవంతంగా బయటకి వస్తాదుకున్న నందమూరి తారకరత్న నిన్న సాయంత్రం తన ప్రాణాలను కోల్పోవడం యావత్తు సినీ లోకాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది నందమూరి అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.కుప్పం లో నారా లోకేష్ చేపట్టిన ‘యువ గళం’ పాదయాత్ర ప్రారంభోత్సవం లో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఆ తర్వాత వెంటనే ఆయనని సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ప్రధమ చికిత్స అందించారు.పరిసితి ఏమాత్రం కూడా కుదుటపడకపోవడం తో మెరుగైన వైద్యం కోసం వెంటనే ఆయనని బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి గత 23 రోజులుగా విదేశాల నుండి ప్రముఖ వైద్యులను రప్పించి చికిత్స చెయ్యిస్తునే ఉన్నారు.కొంతమేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చినప్పటికీ , బ్రెయిన్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం తో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే తారకరత్న కి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఆయనకీ ధూమపానం అనే దుర అలవాటు ఉండడమే అని తెలుస్తుంది.ఆయనకీ సిగెరెట్లు కాల్చే అలవాటు బాగా ఉందని, అందువల్ల ఆయన గుండెలో బ్లాక్స్ ఎక్కువ ఏర్పడ్డాయని , గుండెకి స్టెంట్లు వెయ్యడానికి కూడా డాక్టర్లు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని, అందువల్ల బ్రెయిన్ కి ఆక్సిజన్ సరిగా అందక, పూర్తిగా పని చెయ్యడం మానేసిందని. చివరికి ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తారకరత్న సన్నిహితులు ఈ సందర్భంగా తెలిపారు.
తారకరత్న కి తక్కువ వయస్సు ఉండడం, చాలా కుర్రాడు అవ్వడం కారణంగా ఇన్ని రోజులు చావుతో పోరాడే శక్తి వచ్చిందని, వేరే ఎవ్వరైనా ఇన్ని రోజులు బ్రతకడం అసాధ్యం అంటున్నారు డాక్టర్లు. ఎంతో మంచి మనస్సు ఉన్న తారకరత్న సరిగ్గా శివరాత్రి రోజే చనిపోవడం ని చూస్తుంటే ఆయన పవిత్రమైన ఆత్మ నేరుగా కైలాసం కి చేరుకుంటుందని, ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని అభిమానులు ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు.