Bhanupriya : చిరంజీవి తో జరిగిన ఆ గొడవ వల్లే భానుప్రియ కెరీర్ నాశనం అయ్యిందా?

- Advertisement -

Bhanupriya : నేటి తరం స్టార్ హీరోయిన్స్ అందరూ తమకి ఉన్న అందాన్ని ప్రధాన అస్త్రం గా చేసుకొని సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నారు.కానీ ఆరోజుల్లో ఇలా ఉండేది కాదు, అందం తో పాటుగా అభినయం కూడా అద్భుతంగా ఇచ్చేవాళ్ళు హీరోయిన్స్. అందుకే వాళ్లకి ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించే అవకాశం దక్కింది, ఆరు పదుల వయస్సుకి దగ్గరగా వచ్చినా కూడా ఇప్పటికీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయంటే అందుకు కారణం ఆ హీరోయిన్స్ లో ఉన్న ప్రతిభ వల్లే.

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు భాను ప్రియా. 1980 నుండి 1990 వరకు ఈమె స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగింది. అద్భుతమైన రూపం తో పాటుగా నటన మరియు డ్యాన్స్ లో ఈమె స్టార్ హీరోలతో పోటీపడగలదు.ఇండస్ట్రీ లోకి రాకముందే కూచిపూడి, భారత నాట్యం వంటి క్లాసిక్ డ్యాన్స్ లను అవపోసన పట్టిన ఈమె దాటికి డ్యాన్స్ మాస్టర్స్ సైతం వణికిపొయ్యేవారు.

bhanupriya
bhanupriya

కొత్తరకంగా ఎలా కంపోజ్ చెయ్యాలో తెలియక కొరియోగ్రాఫర్స్ తలలు పెట్టుకునేవారు. ఇక రోజుల్లో డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఆయనకీ పోటీగా డ్యాన్స్ వేసే హీరోయిన్స్ అప్పట్లో రాధ మరియు విజయశాంతి మాత్రమే. కానీ ఎప్పుడైతే విజయశాంతి లైం లైట్ లోకి వచ్చిందో ఆమె డ్యాంసింగ్ టాలెంట్ ముందు రాధా, విజయ శాంతి వంటి వాళ్ళు తేలిపొయ్యేవారు. చిరంజీవి కూడా ఈమెతో డ్యాన్స్ వేసేందుకు కాస్త ముందు వెనక చూసుకొని వేసేవాడట.

- Advertisement -
bhanupriya Husband

ఈ అమ్మాయి నన్ను డామినేట్ చేసేస్తుందని డైరెక్టర్స్ కి కంప్లైంట్ కూడా ఇచ్చేవాడట చిరంజీవి. ఏదైనా చిరంజీవి తన కొత్త సినిమాలో భానుప్రియ హీరోయిన్ అని డైరెక్టర్స్ చెప్తే ఆమె వద్దు, డ్యాన్స్ లో నన్ను పూర్తిగా డామినేట్ చేసేస్తుందని చెప్పేవాడట.అందుకే రాధా, రాధికా మరియు విజయ శాంతి వంటి హీరోయిన్స్ తో చిరంజీవి చేసినన్ని సినిమాలు భానుప్రియ తో చెయ్యలేదని అందరూ అంటూ ఉంటారు. అలా జరగడానికి కారణం చిరంజీవే అని ఆయనతో ఆరోజుల్లో ఈమె గొడవ పెట్టుకున్నట్టు కూడా రూమర్స్ వచ్చాయి.

Actress bhanupriya

ఇది ఇలా ఉండగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా బాగా రాణించింది భానుప్రియ. అయితే తానూ ఎంతగానో ప్రేమించిన భర్త ఆదర్శ్ కౌశల్ చనిపోయిన తర్వాత భాను ప్రియా మానసికంగా ఎంతో వేదనకి గురైంది. ఆమె డ్యాన్స్ మీద విపరీతమైన మక్కువ ఉండడం తో ఒక డ్యాన్స్ స్కూల్ ని కూడా పెడదామని అనుకుందట. కానీ డిప్రెషన్ కి గురి అవ్వడం తో మెమరీ లాస్ రావడం వల్ల నేర్చుకున్నవి కూడా మర్చిపోయింది భానుప్రియ. భర్త చనిపోయిన తర్వాత ఆర్థికంగా కూడా బాగా బలహీనపడ్డ భానుప్రియ తనకి ఉన్న సొంత ఇల్లుని కూడా అమ్మేసి ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తుందట. ఒకప్పటి స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇలా మారిపోవడం ని చూసి సినీ అభిమానులు ఎంతో విచారం ని వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here