Teacher : చంద్రశేఖర్ మాస్టారుతో సిరీస్.. ‘స్వాతి టీచర్’తో మూవీ.. 90’s మిడిల్ క్లాస్ డైరెక్టర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్

- Advertisement -

Teacher : వెబ్ సిరీస్ అనగానే దాదాపుగా ఎక్కువ మంది హిందీ, ఇంగ్లీష్ భాషలకు సంబంధించినవే అనుకుంటారు. తెలుగులో వెబ్ సిరీస్ లు ఇతర భాషలతో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పొచ్చు. హిందీతో పోలిస్తే తెలుగులో అంతగా ఆసక్తి రేపిన సిరీస్ లు ఎక్కువగా లేవని టాక్. అయితే ఇటీవలే తెలుగులో సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకుంది 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే సిరీస్. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు.

ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ అనే ఓటీటీలో స్ట్రీమ్ అయింది. అయితే ఈ సిరీస్ వల్ల ఆ ఓటీటీ ఏకంగా 5 లక్షల మంది పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించింది. ఆ ఓటీటీ నిలబడడానికి ఈ సిరీసే ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. ఆదిత్య హాసన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సిరీస్.. తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

- Advertisement -

ఇందులో ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు. ఇక డైలాగ్స్ అయితే సూపర్ హిట్. తన తొలి సిరీస్ తోనే ఆదిత్య సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇటీవల ప్రేమలు అనే మలయాళం సినిమాకు తెలుగు డబ్బింగ్ కోసం డైలాగులు రాశాడు. ఆ డైలాగులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తన తొలి ఫీచర్ ఫిల్మ్ కోసం రెడీ అయ్యాడు. తాజాగా ఆ చిత్రం గురించి అప్డేట్ కూడా వచ్చేసింది.

స్వాతి టీచ‌ర్.. ఆదిత్య రూపొందించ‌నున్న తొలి సినిమా. ఇందులో స్వాతి టీచ‌ర్ పాత్ర‌ను క‌ల‌ర్స్ స్వాతి పోషించ‌నుంది. బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్నాడు. ‘బాహుబలి’లో యంగ్ ప్రభాస్‌గా నటించింది ఈ కుర్రాడే.  ‘కేరాఫ్ కంచరపాలెం’ సహా పలు చిత్రాల్లో బాల నటిగా చేసిన నిత్యశ్రీ గోరు ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

ఇక ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ను ప్రొడ్యూస్ చేసిన దర్శకుడు నవీన్ మేడారంయే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నాడు. అయితే మొదట దీన్ని వెబ్ సిరీస్ గా తెరకెక్కించాలనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా అనౌన్స్ మెంట్ తో సినిమాగా రిలీజ్ అవుతుందని తేలింది. నైంటీస్ మిడిల్ క్లాస్ సిరీస్ లో చంద్రశేఖర్ మాస్టారులాగే స్వాతి టీచర్ కూడా మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here