Kalki Movie collections రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ కల్కి చిత్రం ఇటీవలే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ మైల్ స్టోన్ ని దాటిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతం సృష్టిస్తూ ముందుకు పోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై నెల రోజులు పూర్తి అయ్యింది. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం జోరు తగ్గలేదు. పైగా ఈ సినిమా తర్వాత వచ్చిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఆడియన్స్ కి కల్కి తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది. చూసిన వారే రిపీట్ గా చూస్తున్నారు.
ఇకపోతే నిన్న అనగా 31 వ రోజు ఈ చిత్రానికి కేవలం బుక్ మై షో, పేటీఏం యాప్స్ నుండి లక్షకి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది ఒక ఆల్ టైం అన్ బీటబుల్ రికార్డుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద చూసుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి నిన్న ఈ చిత్రానికి 70 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. ఇదే తరహా వసూళ్లు మరో 20 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి అత్యధిక 50 రోజుల కేంద్రాలు వచ్చే అవకాశం ఉందట. ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఒక సినిమా నాలుగు వారాలకు మించి ఆడడమే ఎక్కువగా అనిపిస్తుంటే, కల్కి చిత్రం ఏకంగా 50 రోజుల రన్ ని సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సినిమాకి రన్ ఇప్పట్లో ఆగే అవకాశం లేనందున ఓటీటీ విడుదల కూడా పది వారాల తర్వాతే అని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 288 కోట్ల రూపాయిల గ్రాస్, 183 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక లో 36 కోట్లు, తమిళనాడులో 22 కోట్లు, కేరళ లో 13 కోట్లు, హిందీ లో 144 కోట్లు, ఓవర్సీస్ లో 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి ఈ చిత్రం 528 కోట్ల రూపాయలకు పైగా షేర్, 1035 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. బయ్యర్లు ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా 372 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా, 155 కోట్ల రూపాయిల లాభాలు ఇప్పటి వరకు వచ్చినట్టు తెలుస్తుంది.