OTT Movies : ఒక్క రోజులో 30 సినిమాలు..ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి పండగే!

- Advertisement -

OTT Movies : వారం మొత్తం పని చేసి అలిసిపోయిన వారికి వీకెండ్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకోవడం సర్వసాధారణం. ఎంటర్టైన్మెంట్ అంటే మన అందరికీ సినిమాలే. మంచి సినిమా విడుదలైనప్పుడు థియేటర్స్ కి వెళ్తాము, లేదంటే ఓటీటీ లో ఏదైనా క్రేజీ మూవీ చూసి ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాము. ఈ వారం థియేటర్స్ లో విడుదలైన క్రేజీ మూవీస్ ఏమి రావడం లేదు కానీ, వివిధ భాషలకు చెందిన డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీ లో సందడి చేయనున్నాయి. ముందుగా జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి అనే చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం మే 31 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిల్చింది. కానీ కంటెంట్ పరంగా పర్వాలేదు అని రివ్యూస్ వచ్చాయి.

OTT Movies
OTT Movies

అలాగే సావి అనే బాలీవుడ్ చిత్రం, ఘోస్ట్ బస్టర్స్ అనే ఇంగ్లీష్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్నాయి. అలాగే గత ఏడాది విడుదలైన కార్టూన్ ఇంగ్లీష్ చిత్రం మమ్మీస్, వండర్ ల్యాండ్ అనే కొరియన్ చిత్రం, స్క్రీం 6 అనే ఇంగ్లీష్ చిత్రం, ది సోషల్ మీడియా మర్డర్స్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంట్ వెబ్ సిరీస్, డర్టీ పాప్ అనే మరో ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్ కూడా విడుదల కానుంది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాధారణ పొందిన ‘ఎలైట్’ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి సంబంధించి సీజన్ 8 ఇప్పుడు ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది

Netflix's 'Elite' Introduces Trans Actor Ander Puig to Season 6.అలాగే క్లియో అనే జర్మన్ వెబ్ సిరీస్ సీజన్ 2 , ది డెకో మీరన్ సీజన్ 1 , ది టోక్యో స్విన్డెర్ల్స్ సీజన్ 1 , ది డ్రాగన్ పీస్ సీజన్ 6 కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక తెలుగు కి సంబంధించి ఖో ఖో అనే మూవీ ఈటీవీ విన్ యాప్ లో, గెటప్ శ్రీను హీరో గా నటించిన రాజు యాదవ్ ఆహా మీడియా లో, భరతనాట్యం అనే మూవీ, అలాగే చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఏవం వంటి చిత్రాలు ఆహా మీడియా లో అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు ఇంకా పలు వెబ్ సిరీస్ లు, మూవీస్ జీ 5 , అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ చానెల్స్ లో అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

Raju Yadav (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here