Eagle : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత రవితేజ నుండి వచ్చిన చిత్రం అవ్వడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువకే జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 23 కోట్ల రూపాయలకు బయ్యర్స్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసారు. కానీ ఈ సినిమా అది కూడా రికవర్ చేసేలా కనిపించడం లేదు. మొదటి రోజు ఈ చిత్రానికి నాలుగు కోట్ల 40 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ఓపెనింగ్ ‘టైగర్ నాగేశ్వర రావు’ కంటే తక్కువ అని చెప్పొచ్చు, కానీ రెండవ రోజు, మూడవ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ వచ్చాయి.
రెండవ రోజు కూడా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, రెండు రోజులకు కలిపి 8 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫిబ్రవరి నెల సినిమాలు బీభత్సంగా ఆడే నెల కాదు, ఇది సినిమాలకు సీజన్ కాదని అందరూ అంటూ ఉంటారు. ఇలాంటి సీజన్ లో ‘ఈగల్’ చిత్రానికి పని దినాలలో వసూళ్లు వస్తాయా అంటే అనుమానమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళ అంచనా ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమని.
మూడు రోజులకు 12 రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టిన ఈ సినిమా, 23 కోట్ల రూపాయిలు దాటాలంటే కచ్చితంగా ఈరోజు నుండి అన్నీ ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టాలి. మరి ఈ సినిమాకి అంత సత్తా ఉందా రాలేదా అనేది చూడాలి.