యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమాలకు ఈమధ్య ప్రేక్షాధారణ ఏ రేంజ్ లో లభిస్తుందో చెప్పడానికి ఉదాహరణగా నిల్చిన చిత్రం ‘2018’. 2018 వ సంవత్సరం లో కేరళలో వచ్చిన వరదలు అక్కడి ప్రజల జీవితాలను తలక్రిందులు చేసింది. అప్పటి సంఘటనని ఆధారంగా తీసుకొని అందులో చుక్కుకున్న ఒక నలుగురి స్టోరీస్ ని చూపిస్తూ తీసిన ఈ మలయాళీ చిత్రం అక్కడి ఆడియన్స్ కి తెగ నచ్చేసింది.
ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ట్రెండ్ ని కొనసాగిస్తుంది. కేవలం మలయాళం వెర్షన్ నుండే ఈ చిత్రం 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిందంటే ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు, రీసెంట్ గానే ఈ సినిమా తెలుగు లో కూడా డబ్ అయి గ్రాండ్ గా విడుదలైంది. ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే మలయాళం వెర్షన్ కి కలిపి బాహుబలి 2 కలెక్షన్స్ ని దాటేసింది. అయితే బాహుబలి 2 రెండవ వారం వసూళ్లను మాత్రం ఇప్పటి వరకు ఒక్క మలయాళం సినిమా కూడా అందుకోలేకపోయింది. ఇప్పుడు 2018 చిత్రం ఆ రికార్డుని కూడా అధిగమించింది అంటున్నారు, ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ వారం 2018 చిత్రం 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
మొన్న బుధవారం ఒక్కరోజే ఈ చిత్రం మూడు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిందట. ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న ఈ రికార్డుని 2018 చిత్రం అవలీల గా బద్దలు కొట్టడం, ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని సరికొత్త బెంచ్ మార్క్స్ ని పెట్టబోతుందో చూడాలి.