ఒక్క టీజర్ కూడా లేకుండా 120 కోట్లు.. పవన్ కళ్యాణ్ బ్రాండ్ పవర్ కి ఉదాహరణ ఇదే!

- Advertisement -

టాలీవుడ్ లో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి పదాలను తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా చెక్కు చెదరని మార్కెట్ ని మైంటైన్ చేస్తున్న ఏకైక ఇండియన్ స్టార్ ఈయన ఒక్కడే. ఆయన రీమేక్ సినిమాలు సైతం వందల కోట్ల రూపాయిల బిజినెస్ ని చేస్తుంటాయి. రీసెంట్ గా ఆయన సముద్ర ఖని దర్శకత్వం లో ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. వచ్చే నెల 28 వ తారీఖున ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఇంకా రాలేదని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. సినిమా విడుదలకు కేవలం 40 రోజుల సమయం మాత్రమే ఉంది, మేకర్స్ ఇంకా ప్రొమోషన్స్ ప్రారంభించలేదు.

Bro movie

ఇప్పటి వరకు కేవలం పోస్టర్స్ మాత్రమే వచ్చాయి, కానీ సినిమా బిజినెస్ మాత్రం మామూలు రేంజ్ లో జరగడం లేదు. బయ్యర్స్ ఈ సినిమా కి సంబంధించి కేవలం ఆంధ్ర ప్రదేశ్ రైట్స్ ని 70 కోట్ల రూపాయలకు కొనడానికి సిద్ధంగా ఉన్నాడట. మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ ఇంకా ప్రారంభించలేదు కాబట్టి, అప్పుడే బిజినెస్ ని క్లోజ్ చేసే ఆలోచనలో లేరట.

- Advertisement -
Pawan kalyan sai dharam tej

ఎందుకంటే ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చిన తర్వాత మరింత ప్రైజ్ పెరిగే అవకాశం ఉంటుందని వాళ్ళ అంచనా. అలాగే తెలంగాణ ప్రాంతం లో కూడా ఈ చిత్రాన్ని 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యడానికి సిద్ధం గా ఉన్నారట. ఇక ఆ తర్వార ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతానికి కలిపి 20 కోట్లు , మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు పలుకుతుందట. టీజర్ , పాటలు మరియు ట్రైలర్ విడుదలైతే ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here