Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి వారం లోనే దాదాపుగా 500 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా జోరు ఒక్కసారిగా పడిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకో ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

గత ఏడాది ఇదే సీజన్ లో వచ్చిన రవితేజ ‘ధమాకా’ చిత్రం దాదాపుగా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా న్యూ ఇయర్ నాడు దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ సలార్ జోరు ఆ రేంజ్ లో మాత్రం లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఫలితంగా ప్రతీ ప్రాంతం లో ఈ సినిమా నష్టం మిగిలించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భయపడుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం నైజాం మరియు నార్త్ అమెరికా ప్రాంతాల్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్నీ చోట్ల భారీ నుండి అతి భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. హిందీ లో ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 230 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి.

ఇప్పటి వరకు కేవలం 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో మరో 20 నుండి 30 కోట్ల రూపాయిలు వచ్చినప్పటికీ కూడా , ఈ సినిమాకి కనీసం వంద కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని కూడా నష్టాలను కొని తెచ్చుకున్న సినిమాల జాబితాలోకి సలార్ చేరిపోతుంది.
