Raj Tarun : హీరో రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం రోజుకి ఒక మలుపుని తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తప్పు ఎవరి వైపు ఉంది అనేది ఇప్పటికీ ఎవ్వరు తేల్చలేకపోతున్నారు. లావణ్య చౌదరి తరుపున లాయర్ గా వ్యవహరిస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకర మాత్రం, ఈ కేసులో లావణ్య కి న్యాయం జరగకపోతే రాజ్ తరుణ్ కి పదేళ్ల జైలు శిక్ష పడేలా చేస్తానని భీష్మించి కూర్చున్నాడు. ఈమధ్య కాలం లో ట్రెండింగ్ లో ఉన్న కేసులన్నీ కళ్యాణ్ దిలీప్ సుంకర డీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువ శాతం కేసులు సక్సెస్ అయ్యాయి. రోజురోజుకి రాజ్ తరుణ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సమకూరుతూ, ఉచ్చు బిగుసుకోవడంతో అతనికి జైలు శిక్ష కచ్చితంగా పడుతుందేమో అనే సందేహం నెటిజెన్స్ లో మొదలైంది.
ఒక్కటైతే నిజమని లావణ్య ఇచ్చిన ఆధారాలతో రుజువు అయ్యింది. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తున్నాడు. అది స్నేహమా, లేదా ప్రేమనా అనేది పక్కన పెడితే, రాజ్ తరుణ్ మాల్వీ కోసం స్విగ్గి , జొమాటో వంటి యాప్స్ లో ఎన్నో ఆర్డర్లు పెట్టినట్టు రుజువులు ఉన్నాయి. అలాగే మాల్వి మల్హోత్రా ని పెళ్లి చేసుకోవడం కోసం, లావణ్య కి విడాకులు ఇవ్వాల్సిందిగా రాజ్ తరుణ్ ఒత్తిడి చేసినట్టు వాట్సాప్ మెసేజిలు ఉన్నాయని, అది పోలీసులకు అందించాం అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పుకొచ్చాడు. ఎటు చూసినా రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు రోజురోజుకి బలంగా బిగుసుకుంటూ పోతుంది. అతనితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఈ కేసులో చిక్కుకునే ప్రమాదం ఉంది.
అంతే కాకుండా రాజ్ తరుణ్ గత మూడు రోజుల నుండి మీడియా కి పూర్తిగా అందుబాటులో లేకపోవడం కూడా అతనికి మైనస్ అవుతుంది. మరోపక్క రాజ్ తరుణ్ , మాల్వి మల్హోత్రా హీరో హీరోయిన్లు గా నటించిన ‘తిరగబడరా సామీ’ అనే చిత్రం వచ్చే నెలలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మంచి ట్రెండింగ్ టాపిక్ అవ్వడం తో ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఈ ట్రెండ్ ని క్యాష్ చేసుకోవడం కోసం నిర్మాతలు తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం తో పాటు రాజ్ తరుణ్ పురుషోత్తముడు అనే చిత్రం లో కూడా హీరో గా నటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది.