Megastar Records : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అప్పటికీ ఇప్పటికీ మెగాస్థార్ చిరంజీవి నెంబర్ 1 హీరో అని అందరూ అంటూ ఉంటారు.. అది ముమ్మాటికీ నిజమే అని రీసెంట్ గా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ నిరూపించింది..ఈ సినిమాకి ముందు మెగాస్థార్ చేసిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి..దీనితో చిరంజీవి డౌన్ ఫాల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పచ్చ మీడియా మరియు దురాభిమానులు ఆయన పని ఇక అయిపోయింది..
ఇండస్ట్రీ లో మొదటి నుండి ఇలాగే నెంబర్ 1 అని రుద్దారు..అదంతా ఫేక్..చిరంజీవి ఫేక్ స్టార్ అంటూ ఎన్నో కామెంట్స్ చేసారు..అలా కామెంట్ చేసిన ప్రతీ ఒక్కరి నోర్లను మూయించాడు మన మెగాస్థార్..ఆయనకీ ఇది కొత్తేమి కాదు..ఇప్పటికి మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కి సాధ్యపడని అరుదైన రికార్డుని నెలకొల్పి తనకి తానే సాటి ఎవ్వరూ లేరు పోటీ అని నిరూపించుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే మెగాస్థార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చేముందు మన టాలీవుడ్ లో ‘బాహుబలి’ మినహా ఒక్క సినిమా కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోలేదు..అలాంటి సమయం లో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో వంద కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన మొట్టమొదటి నాన్ రాజమౌళి హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.. చిరంజీవి కి ఆయుధాలు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కపెట్టి ‘సై రా నరసింహా రెడ్డి’ చిత్రం చేసాడు.
ఈ సినిమా ఏకంగా 140 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.. ఇక ఆ తర్వాత వరుసగా రెండు ఫ్లాప్స్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య‘ చిత్రం తో మూడవసారి వంద కోట్ల రూపాయిలను కొల్లగొట్టి, టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత మూడు సార్లు వందకోట్ల రూపాయిల షేర్ కొల్లగొట్టిన ఏకైక హీరో గా చిరంజీవి నిలిచాడు.. 68 ఏళ్ళ వయస్సులో ఇలాంటి రికార్డ్స్ పెట్టడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి.