Tollywood Actors Remuneration : సినిమా సెలబ్రిటీలకు ఫ్యాన్స్ కు కొదువ ఉండదు. తాము అభిమానించే హీరోహీరోయిన్లకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు ఫ్యాన్స్. వారి పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన రోజు, పస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన రోజు ప్రతి విషయం తెలుకుసుకుంటారు. వాటిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వాళ్లకు ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన వ్యక్తి ఇలా తమ అభిమాన తారలకు సంబంధించి అన్ని విషయాలు ఫ్యాన్స్ కు తెలిసిపోతాయి.
ఇలా అన్ని విషయాలు తెలుసుకునే ఫ్యాన్స్ కు తమ ఫేవరెట్ హీరో ఏ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం మాత్రం తెలియదు. స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఓ లుక్కేద్దామా..?
ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో అందరికంటే ముందున్నాడు. బాహుబలి తర్వాత నటించిన సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్స్‌గా మిగిలినా.. ప్రభాస్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అందుకే రెమ్యునరేషన్‌ని పెంచేశాడట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు తీసుకుంటూ.. టాలీవుడ్ నుంచి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో మొదటి స్థానంలో ఉన్నాడు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. మహేశ్‌తో సినిమా తీస్తే.. లాభాలు పక్కా అనే నమ్మకం టాలీవుడ్‌లో ఉంది. ఆయనతో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. సర్కారు వారి పాట విజయం తర్వాత మహేశ్ తన రెమ్యునరేషన్ పెంచేశాడట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు’ తో పాటు హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ లోనూ నటిస్తున్నాడు.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమా కంటే ముందు రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ఎన్టీఆర్.. ఇప్పుడు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్‌తో ఎన్టీఆర్ ఒక్కడే కాడు రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
పుష్ప తర్వాత అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేశాడట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నాడని టాక్.