100 Crores movies : 2022లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు ఇవే..!

- Advertisement -

100 Crores movies : కరోనా వల్ల రెండేళ్లు చతికిలపడిపోయిన ఇండియన్ సినిమా బాక్సాఫీసుకు 2022 ఊపిరి పోసింది. ఓవైపు థియేటర్.. మరోవైపు ఓటీటీకి రైట్స్ అమ్మకాలతో వసూళ్లు ఊపందుకున్నాయి. 2022లో చాలా సౌత్ ఇండియన్ సినిమాలు బాక్సాఫీసును తమ వసూళ్లతో షేక్ చేశాయి. చిన్న సినిమాలుగా రిలీజ్ అయి ఏ మాత్రం అంచనాలు లేని కాంతార వంటి సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరాయి. మరి ఈ బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో.. వాటి కలెక్షన్లు ఎంతో ఓసారి చూసేద్దామా..

Kantara
Kantara

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ కాంతార. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న సినిమాగా కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు, తమిళం వంటి సౌత్ ఇండియా భాషల్లోనే గాక బాలీవుడ్ లోనూ విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. రిషబ్ శెట్టికి కూడా పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు వసూల్ చేసింది.

Brahmastra
Brahmastra

బ్రహ్మాస్త్ర.. ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ బ్రహ్మాస్త్ర- శివ పార్ట్ 1గా నటించింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రూ.225 కోట్లు వసూల్ చేసింది.

- Advertisement -

భూల్ భులయ్యా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కామెడీ హార్రర్ సినిమా భూల్ భులయ్యా2. కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణీలు ఈ మూవీలో తమ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రిలీజైన నెలలోనే బాక్సాఫీస్ వద్ద రూ.171 కోట్లు వసూల్ చేసింది. ఈ మూవీకి అనీశ్ బాజ్మీ దర్శకత్వం వహించారు.

దృశ్యం-2 రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. ఈ మూవీ కరోనా వల్ల ఇతర భాషల్లో ఓటీటీలోనే రిలీజ్ అయింది. కానీ బాలీవుడ్ కాస్త ఎదురుచూసి ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేసింది. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ రీమేక్ లో దాదాపు రూ.196 కోట్లు వసూల్ చేసింది.

కశ్మీర్ పండితులపై జరిగిన దుశ్చర్యలను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లాంటి సీనియర్ నటులు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు వసూల్ చేసింది.

PS1
PS1

మణిరత్నం చేయి నుంచి జాలువారిన మరో చిత్రం పొన్నియన్ సెల్వన్. జయం రవి, విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు వంద కోట్ల మార్క్ ను దాటింది.

RRR

 ఆర్ఆర్ఆర్ తో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లను ఈ సినిమా పాన్ ఇండియా స్టార్లను చేసింది. జక్కన్న ఇమేజ్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో పెంచింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లు వసూల్ చేసింది. 

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, ఫహాద్ ఫాజిల్ వంటి సూపర్ స్టార్స్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో ప్రేక్షకుల్లో జోష్ నింపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్లు వసూల్ చేసింది. 

కేజీఎఫ్ 2. 2022లో బాక్సాఫీసును షేక్ ఆడించిన సినిమాల్లో కేజీఎఫ్-2 మూవీది స్పెషల్ స్థానం. ఈ మూవీతో కన్నడ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ.430 కోట్లు వసూల్ చేసింది.

ఆలియా భట్ కెరీర్ లో గంగూభాయి కాటియావాడీ మూవీది చాలా స్పెషల్ ప్లేస్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లు వసూల్ చేసింది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here