Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది . ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను గొప్పగా చిత్రీకరించాలనుకునే గుణశేఖర్ శాకుంతలం వంటి పౌరాణిక ప్రేమ గాధను ఎలా తెరకెక్కించి ఉంటారో మనందరం అర్థం చేసుకోవచ్చు.. సినిమాలో సహజత్వం కనిపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో సమంతకి ఉపయోగించిన నగలను ఒరిజినల్ ఉపయోగించారు..
శాకుంతలం సినిమాలో సమంతకి స్టైలిస్ట్ గా నీతా లుల్లా వ్యవహరించారు. సమంత శాకుంతలం సినిమా కోసం ఉపయోగించిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు . యువరాణిగా శాఖలను చూపించే క్రమంలో సహజత్వం కోసం ఒరిజినల్ నగలను ఉపయోగించారట. ఆ నగలు విలువ రూ.3 కోట్లని సమాచారం. ఈ నగలను వసుంధర డైమండ్ రూఫ్ వారు సమర్పించారు. ఈ సినిమాలో సమంత చీరను ఒరిజినల్ ముత్యాలను పొదిగి చేయించారు. 30 కిలోల బరువు ఉండే ఈ చీరను సమంత ఏడు రోజులపాటు ధరించి షూటింగ్లో పాల్గొన్నారు.
ఈ సినిమాలో దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతల పాత్రలో సమంత నటించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రీడి టెక్నాలజీతో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి.