Rashmika Mandanna .. ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. ఛలో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. చూసీచూడంగానే యువకులకు నచ్చేసింది. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు మీకెవ్వరు, పుష్ప, వారసుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
ఈ బ్యూటీ తన సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్ తో కూడా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ క్యూట్ క్యూట్ గా బిహేవ్ చేస్తూ తన ఫ్యాన్ డమ్ ను పెంచుకుంది. ఇక పుష్పతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందింది. ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది.
తాజాగా రష్మిక మందన్న.. తమిళ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన వారసుడుతో సందడి చేసింది. తన ఫేవరెట్ హీరో విజయ్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. విజయ్ తన ఫేవరెట్ హీరో అని.. వారసుడులో నటించడంతో తన డ్రీమ్ కంప్లీట్ అయిందని చెప్పింది. ఆ సినిమా ప్రమోషన్స్ లోనే ప్రస్తుతం ఈ క్యూటీ బిజీగా ఉంది.
రష్మిక పోస్ట్ చేసే ఫొటోల్లో తన చేతిపై ఇర్రీప్లేసబుల్ అనే టాటూ కనిపిస్తుంటుంది. దీని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘మొదట నాకు టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు. మా కాలేజీలో ఒక అబ్బాయి ‘ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులన్నా భయమే’ అన్నాడు. అది తప్పు అని నిరూపించాలని నేను టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నా.
కానీ ఏం వేయించుకోవాలో తెలీలేదు. చాలా సేపు ఆలోచించాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఎవరూ మరొకరిని భర్తీ చేయలేరని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. ఇదే అర్థం వచ్చేలా ఇర్రీప్లేసబుల్ అనే పదాన్ని వేయించుకున్నా’’ అంటూ తన టాటూ వెనక ఉన్న రహస్యాన్ని తెలిపింది ఈ నేషనల్ క్రష్.
ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’ లో నటిస్తోంది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్ర స్పైథ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’లో కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.