Pawan Kalyan : ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా జనాలను ఆకట్టుకుంటున్న ఏకైక షో అన్ స్టాపబుల్.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఎంథగా ప్రజాదారణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదటి సీజన్ ను విజయ వంతంగా పూర్తీ చేసి రెండో సీజన్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఎన్నో రికార్డులను నెలకొల్పింది. వచ్చిన గెస్ట్ ల దగ్గర నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకు లాగి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో బాలయ్య బాగా సక్సెస్ అయ్యారు.
మొదటి సీజన్ ను మించి ఇక్కడ ఎంటర్టైన్ చేస్తుంది రెండో సీజన్..ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం ఈ షోలో పాల్గొన్నాడు. న్యూ ఇయర్ కానుకగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం బాలయ్య షోకు గెస్ట్ గా విచ్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
రెండు రోజుల క్రితం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చేస్తున్నా ఎపిసోడ్ ఈ సంక్రాంతికి విడుదల చెయ్యాలని ఆఁహా యాజమాన్యం భావిస్తున్నారు..ఈ సందర్భంగా పవన్ ను వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం టచ్ చేస్తూ బాలయ్య ప్రశ్నలు వేశారని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ షోలో పవన్ కళ్యాణ్ ధరించిన బ్లాక్ హుడి ధర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. దాని ధర ఎంత వుంటుంది, దాని ప్రత్యేకతలు ఇవే అంటూ రెండు రోజుల నుంచి తెగ ట్రోల్స్ వస్తున్నాయి..
పవన్ ఎం చేసిన కొత్తగా వుంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది..ఇంతకీ ఆ కోటు ఖరీధు వచ్చేసి విదేశాల్లో 245 డాలర్లుగా ఉంది. అంటే మన భారతీయ మార్కెట్ లో రూ.20 వేల నుంచి రూ. 27 వేల వరకు ఉంటుంది. ఈ విషయం తెలియడంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అయింది..ఈ మధ్య కాలంలో వైట్ డ్రెస్ లో కనిపిస్తున్న ఆయన ఇప్పుడు ఇలా కనిపించడం పై గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని తెలుస్తుంది.. కనీసం అక్కడ కూడా వదలరా అంటూ తిట్టిపోస్తున్నారు..అక్కడ కూడా వదలరా అంటూ ఫైర్ అవుతున్నారు..ఇకపోతే ప్రస్తుతం రెండు , మూడు భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.