Katrina Kaif-Vicky Kaushal Celebrations : బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల పెళ్లి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. రాజస్థాన్‌లోని సిక్స్త్ సెన్స్ ఫోర్ట్‌లో 2021 డిసెంబర్ 9న వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కేవలం బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది.
పెళ్లికి ముందే కొన్నాళ్ల పాటు డేటింగ్ లో మునిగి తేలిన ఈ స్టార్స్ మ్యారేజ్ తర్వాత కూడా చాలా ప్రైవేట్ గా ఉంటున్నారు. వివాహా బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. మ్యారేజ్ అయ్యాక ఇద్దరూ కలిసి పలు టూర్లు, వేకేషన్లు, పార్టీలకు వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరోవైపు కేరీర్ లోనూ బిజీగా ఉంటున్నారు.
వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా కత్రినా, విక్కీలు వెకేషన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి జాలీగా తమ ఫస్ట్ యానివర్సరీ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి రోజు సందర్భంగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. తమకు సంబంధించిన లవ్లీ ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
‘నా కాంతి కిరణమా.. హ్యాపీ వన్ ఇయర్’ అని ట్వీట్ చేస్తూ.. రెండు ఫొటోలనూ పంచుకుంది కత్రినా కైఫ్. అలాగే భర్త డాన్స్ చేస్తున్నమరో వీడియోను పోస్ట్ చేసింది. భర్త విక్కీ కౌషల్ కూడా అందంగా విషెస్ తెలిపారు. ‘నీ ప్రేమలో ఏడాది సమయం చాలా అద్భుతంగా గడిచింది. మన వివాహా వార్షికోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను నిన్ను ఎప్పటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి కత్రీనా కైఫ్ తన భర్తను సర్ ప్రైజ్ చేసినట్టు తెలుస్తోంది. విక్కీ కౌశల్ కోసం ఓ కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చిందంట. అది కూడా విక్కీకి ఎంతో ఇష్టమైన కలర్ కారునే గిఫ్ట్ గా ఇచ్చిందంట. ఇక విక్కీ కౌషల్ కూడా తన భ్యార కత్రినా హృదయానికి అత్యంత దగ్గరగా ఉండే కస్టమైజ్డ్ జ్యువెలరీ పీస్‌ను అందించాడని బీ టౌన్ లో ప్రచారం జరుగుతోంది.