Celebrity Marriages : సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు కామన్.. ఒకరితో జీవితం నచ్చకపోతే మరొకరిని పెళ్ళి చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. అంతేకాదు లివింగ్ రిలేషన్, విడాకులు ఈ పదాలు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక్క మాటలలో చెప్పాలంటే నూలు పోగులా వీరి బంధాలు మారాయి.ఎప్పుడూ తెగుతాయో..ఎప్పుడు ఊడతాయో అర్థం కాదు.వీళ్లు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో..ఎప్పుడు విడిపోతారో కూడా అర్థం కాదు. కొందరు స్టార్ సినీ సెలబ్రిటీలు అయితే సైతం ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా సినిమా రంగంలో ప్రేక్షకుల చేత స్టార్ హీరోలుగా ఉండి మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ స్టార్లు ఎవరో చూద్దాం..
జెమినీ గణేషన్..
తమిళంలో ఎవర్‌గ్రీన్ హీరో జెమినీ గణేషన్ సైతం తొలి భార్యకు దూరమయ్యాక తెలుగు హీరోయిన్ పుష్పవల్లితో ఎఫైర్ పెట్టుకుని సహజీవనం చేశాడు. వీరి సంతానమే బాలీవుడ్ అందాల నటి రేఖ. ఆ తర్వాత సావిత్రిని మూడో వివాహం చేసుకున్నాడు..
రాధిక ..
రాధిక కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్నప్పుడు మళయాళ దర్శకుడు ప్రతాప్ పోతన్‌ను 1985లో పెళ్లాడింది. యేడాదికే విడాకులు ఇచ్చేసి ఓ బ్రిటీష్ వ్యక్తిని పెళ్లాడి లండన్‌లో స్థిరపడింది. వీరికి ఓ కుమార్తె పుట్టాక రాధికను అతడు హింసించడంతో విడాకులు ఇచ్చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. తర్వాత సీనియర్ నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తోంది. శరత్‌కుమార్‌కు కూడా ఇది రెండో వివాహం..వీరు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు..
కమల్‌హాసన్ ..
లోకనటుడు కమల్‌హాసన్ ముందుగా వాణీగణపతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లకే విడాకులు ఇచ్చేసి అప్పట్లో బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్‌గా ఉన్న సారికతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా యేళ్ల పాటు సారికతో కలిసే ఉన్న కమల్ ఆమెకు విడాకులు ఇచ్చేసి సీనియర్ నటి గౌతమితో సహజీవనం చేశాడు. ఇది అఫీషియల్‌గానే జరిగింది. తర్వాత గౌతమి కూడా కమల్‌కు దూరమైంది. ఇప్పుడు ఉత్తమవిలన్, విశ్వరూపం హీరోయిన్ పూజాకపూర్ – గౌతమి ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయి.
నరేష్ ..
సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ చిన్న వయస్సులోనే పెళ్లాడాడు. వీరి కొడుకే హీరో నవీన్ విజయ్‌కృష్ణ. ఆమెతో మనస్పర్థలతో విడాకులు ఇచ్చేసి ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు పుట్టాక ఇప్పుడు ఆమెతో దూరంగా ఉంటూ సీనియర్ నటిమణి పవిత్రా లోకేష్‌తో ఉంటోన్న సంగతి తెలిసిందే.మీడియాలో గత కొద్ది రోజులుగా వీరి పేర్లు మారు మోగి పోతున్నాయి..
పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఎప్పుడూ ఆయన మూడు పెళ్లిళ్లే కాంట్రవర్సీ అవుతాయి. ముందుగా పవన్‌కు వైజాగ్‌కు చెందిన నందిని అనే అమ్మాయితో పెళ్లి అయ్యింది. ఈ పెళ్లి చిరంజీవి స్వయంగా దగ్గరుండి చేశాడు. పవన్ సినిమాల్లోకి రావడానికి ముందు ఈ పెళ్లి జరిగింది. సినిమాల్లోకి వచ్చాక తనతో బద్రి, జానీ సినిమాలు చేసిన రేణుదేశాయ్‌తో పవన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక రేణుకు విడాకులు ఇచ్చేసి తీన్‌మార్ హీరోయిన్ అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు..
వీళ్ళే కాదు బాలీవుడ్ నటులు కిషోర్ కుమార్ – వినోద్ మెహ్రా – సిద్ధార్థ్‌రాయ్ కపూర్ – సంజయ్‌దత్ – కరణ్‌సింగ్ గ్రోవర్ మొదలగు వాళ్ళు వున్నారు..తెలిసి వీళ్ళు..తెలియని వాళ్ళు ఇంకెంత మందో..