Big Boss : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రోజు నుండే ఎంతో ఆసక్తికరమైన టాస్కులతో, ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఉల్టా పల్టా’ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన బిగ్ బాస్ కి ప్రతీ ఒక్కరు బాగా కనెక్ట్ అయ్యారు. ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్స్ లో కెప్టెన్ ఉండేవాడు, కానీ ఈసారి కెప్టెన్ లేడు. కెప్టెన్ కి బదులుగా ‘పవర్ అస్త్ర’ ని ప్రవేశ పెట్టారు.
ఈ పవర్ అస్త్ర ని గెలుచుకున్న వారు ఇంటి సభ్యులు అవ్వడమే కాకుండా, నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటి కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు శివాజీ మరియు సందీప్ ఈ పవర్ అస్త్ర ని దక్కించుకున్నారు. గత వారం పవర్ అస్త్ర టాస్కు కోసం ప్రియాంక , శోభా శెట్టి మరియు యావర్ పోటీ పడగా, శోభా శెట్టి పవర్ అస్త్ర ని గెలుచుకొని మూడు వారాలు నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటి దక్కించుకుంది.
అయితే ఈ పవర్ అస్త్ర టాస్కు కి పోటీ పడేందుకు ప్రియాంక జైన్ తన జుట్టు ని కత్తిరించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో కత్తిరించుకోవడానికి ఇబ్బంది పడిన ప్రియాంక , ఆ తర్వాత మాత్రం భలే స్టైల్ గా ఉంది అని మురిసిపోయింది. అయితే ఆడపిల్ల జుట్టు కత్తిరించుకోవడం అనేది చాలా పెద్ద విషయం, అందులోనూ ప్రియాంక లాంటి టాప్ సీరియల్ ఆర్టిస్టుకి ఇంకా కష్టం. అందుకే ఆమెకి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ని పెంచినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఇంతకు ముందు ఆమెకి వారానికి 2 లక్షల 50 వేలు ఇచ్చారు. ఈ వారం నుండి 3 లక్షలు ఇవ్వబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ప్రియాంక ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉండే కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంది, ఈసారి నామినేషన్స్ లోకి వస్తే ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం లో ఆమె తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.